
వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): వైద్యసిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని సోమవారం డీఎంహెచ్‌వో సీతా రాంతో కలిసి సందర్శించారు. ఆస్పత్రి వార్డులు, ల్యాబ్‌తోపాటు పరిసరాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. అనంత రం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటి పనులను పీడీ వేణుగోపాల్‌తో కలిసి పరిశీలించారు.
యూరియా కొరత లేకుండా చూడాలి
రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని ఆగ్రో ఫర్టిలైజర్ షాపు తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలు, విద్యాబోధన అంశాల గురించి తెలుసుకున్నారు. వంటకు నాణ్యమైన సరుకులు వినియోగించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ సూర్యప్రకాష్, ఏవో దిలీప్‌కుమార్, ప్రిన్సిపాల్ రజనీ తదితరులు ఉన్నారు.