
మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలి
● ఎస్పీ కాంతిలాల్ పాటిల్
కాగజ్‌నగర్‌టౌన్: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాలతోపాటు మండలంలోని చింతగూడ, బలగల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠ శాల, గన్నారం జెడ్పీఎస్‌ఎస్‌లో సోమవారం విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలన, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి తప్పుదోవ పడుతున్నారన్నారు. గంజాయి, డ్రగ్స్, వంటి మత్తు పదా ర్థాలకు బారిన పడకుండా ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని, వాటి సాకారం దిశగా అడుగులు వేయాలని సూచించారు. జిల్లాలో మాదకద్రవ్యాల గురించి తెలిస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1908 లేదా 87126 70551 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రవిచంద్ర, టౌన్ సీఐ ప్రేంకుమార్, ఎస్సైలు సుధాకర్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.