
వైద్య కళాశాలలో వసతుల కల్పనకు చర్యలు
● రాష్ట్ర ఆరోగ్యశాఖ అడిషనల్ సెక్రెటరీ అయేషా మస్రత్ ఖానమ్
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌ లిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య శాఖ అడిషనల్ సెక్రెటరీ అయేషా మస్రత్ ఖానమ్ అన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని అంకుసాపూర్‌లో గల ప్రభుత్వ వైద్య కళాశాల ను శనివారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతో కలిసి సందర్శించారు. తరగతి గదులు పరిశీలించి విద్యార్థుల ను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించా రు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలన్నారు. త్వరలోనే బోధన సమస్యలు తీర్చేందుకు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తామన్నారు. ఒప్పంద పద్ధతిలో ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. ఆస్పత్రి, వైద్య కళాశాల భవ న నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొస్తున్నాయన్నారు. త్వరలోనే వసతిగృహాల నిర్మాణం కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కళాశాల భవనం పూర్తిచేస్తామన్నారు. ఒకే ప్రాంతంలో వసతిగృహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ ఆస్పత్రిని సందర్శించారు. డయాలిసిస్ కేంద్రం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ గదులను పరిశీలించారు. ప్రజలను నాణ్యమైన వైద్యం అందించాలని, డాక్టర్లు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, ఆస్పత్రి పర్యవేక్షకులు, వైద్యులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.