
స్వయం సహాయక సంఘాల అభివృద్ధే లక్ష్యం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలోని స్వయం సహా యక సంఘాల అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ర్యాంప్ డైరెక్టర్ ఎండీ ఖాసిం తెలిపారు. ఎస్‌హెచ్‌జీ మహిళా సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ర్యాంప్(రైసింగ్ అండ్ యాక్సలెరేటింగ్ ఎంఎస్‌ఎంఈ పర్ఫార్మెన్స్)లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఔత్సాహిక మహిళలకు అవగాహన సదస్సు అనంతరం 15రోజులపాటు పరిశ్ర మ నిర్వహణ, ఉత్పత్తుల మార్కెటింగ్, నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. పరిశ్రమలకు రిజిస్ట్రేషన్, బ్యాంకుల ద్వారా రుణ సాయం ఇప్పించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీఏ రామకృష్ణ, డీపీఎం అన్నాజీ, ఏపీఎం సదానందం తదితరులు పాల్గొన్నారు.