
ఇందిరమ్మ ఇళ్లపై నివేదిక అందజేత
ఆసిఫాబాద్‌అర్బన్: దహెగాం మండలం కొత్మీర్ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మండల పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల పూర్తి వివరాల నివేదికను గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఏవో కిరణ్‌కు అందించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తారని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో తమ పాత్ర లేకున్నా.. రెండో జాబితాలో ఇళ్లు వస్తాయో.. రావో అనే అనుమానంతో కొందరు మహిళలు ఫిర్యాదు చేశారని అన్నారు. ఎవరి వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయలేదని, ఆరోపణలకు వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో నివేదిక రూపొందించామని పేర్కొన్నారు.