
ఆసిఫాబాద్–ఆదిలాబాద్ రోడ్డు పూర్తి చేయాలి
రూ.26 కోట్లతో చేపట్టిన ఆసిఫాబాద్–ఆదిలాబాద్ బీటీ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. 2003లో టెండర్ల ప్రక్రియ పూర్తికాగా కాంట్రాక్టర్ రూ.4.5 కోట్ల పనులు చేపట్టాడు. బిల్లులు రాక పనులు ఆపేశాడు. రోడ్డు గుంతలు పడింది. ఈ మార్గంలో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఐటీడీఏ రోడ్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. పీసా చట్టం ప్రకారం గ్రామసభలు నిర్వహించకుండా ప్రభుత్వం జారీ చేసిన టైగర్ జోన్ జీవో 49ని వెంటనే రద్దు చేయాలి.
– కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే