
ముగిసిన జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో ప్రవేశం కోసం జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడాపాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఎంపిక పోటీలు ముగిశాయని డీఎస్‌వో మీనారెడ్డి బుధవారం తెలిపారు. జిల్లాలో 35 మంది విద్యార్థులు పాల్గొనగా, ఉత్తమ ప్రతిభ చూపిన 10 మంది బాలురు, 10 మంది బాలికలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామని పేర్కొన్నారు. వీరికి జూలై 1న హైదరాబాద్‌లోని హకీంపేట్ క్రీడాపాఠశాలలో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. హకీంపేట్ అథ్లెటిక్స్ శిక్షకుడు గోపాల్ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. కోచ్‌లు విద్యాసాగర్, అరవింద్, పీడీ, పీఈటీలు మధుసూదన్, జయశ్రీ, ఇందిర, వెంకటేశ్ పాల్గొన్నారు.