
పెద్దపులి కదలికలు
తిర్యాణి(ఆసిఫాబాద్): తిర్యాణి మండలం చోపిడి బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మంగళవారం పెద్దపులి కదలికలు గుర్తించినట్లు ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం చోపిడి బీట్ పరిధిలోని గోవర్‌గూడ, చోపిడి, సోనాపూర్ గ్రామాల్లో పులి కదలికలపై అవగాహన కల్పించారు. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్దపులి రెబ్బెన రేంజ్ పరిధిలోని ఆసిఫాబాద్ మండలం రౌట సంకెపల్లి వైపు వెళ్లినట్లు ఆయన తెలిపారు. ఎక్కడైనా పులి కదలికలు గుర్తిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.