
జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ కోచ్‌గా సాయి
ఆసిఫాబాద్‌రూరల్: జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు కోచ్‌గా గోగర్ల సాయి ఎంపికయ్యారని ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని వాసవి స్కూల్ పీఈటీగా ఆయన పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి గుజరాత్‌లోని భుజ్ పట్టణంలో జరిగే హెచ్‌ఎఫ్‌ఐ 54వ సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ పోటీల్లో తెలంగాణ జట్టుకు సాయి కోచ్‌గా వ్యవహరిస్తారని వెల్లడించారు. గతలో కూడా ఆయన జిల్లా, రాష్ట్ర జట్టుకు కోచ్‌గా వ్యవహరించారని తెలిపారు.