
మిషన్ భగీరథ నీటిని అందిస్తాం
కెరమెరి(ఆసిఫాబాద్): గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని నిరంతరంగా అందిస్తామని మిషన్ భగీరథ ఎస్‌ఈ రవీందర్ అన్నారు. మండలంలోని బాబేఝరి గ్రామ పంచాయతీకి చెందిన గిరిజనులు తాగునీటి కోసం కెరమెరి ప్రధాన రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం జోడేఘాట్, కొలాంగూడ, శివగూడ, చిన్న, పెద్ద పాట్నాపూర్, బాబేఝరి, మహరాజ్‌గూడ, గోండ్‌గూడ, పాటా గూడ గ్రామాలను సందర్శించారు. బావులు, మోటార్లు, భగీరథ పైపులు, వాటర్ ట్యాంకులను పరిశీలించారు. కొన్నిచోట్ల చేతిపంపులకు మరమ్మ తు చేయించారు. మహరాజ్‌గూడకు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేశారు. అనంతరం మాట్లాడుతూ కొన్ని కారణాలతో నీటి సరఫరా ఆగిన విష యం వాస్తవమేనని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. మంగళవారం రాత్రి వరకు శివగూడ గ్రామానికి, బుధవారం జోడేఘాట్‌కు నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. తాగునీటి కోసం ఆందోళనలు చేపట్టొద్దని సూచించారు. ఆయన వెంట ఆసిఫాబాద్ ఈఈ సిద్దిఖి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ విశ్వేశ్వరావు, సాయికిరణ్, జోడేఘాట్ కార్యదర్శి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.