
పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోం
కాగజ్‌నగర్‌టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పేదలకు అన్యాయం జరి గితే ఊరుకోమని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని వార్డు నం.1, గుంటూరు కాలనీ, ఎఫ్ కాలనీలో మంగళవారం పర్యటించారు. అధికారులు సర్వే చేయకుండానే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా ఎంపిక చేశామని చెప్పడం దారుణమన్నారు. ఒంటరి మహిళలు, వృద్ధ మహిళలు అనే కారణంతో అనర్హులుగా ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. అర్హులకు ఇళ్లు ఇవ్వకుంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తాజ్‌మహ్మద్ బాబా, మినాజ్, రాజు, వరలక్ష్మి, కమల తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌తోనే అభివృద్ధి
కౌటాల: కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండలంలోని కన్నెపల్లి, బోదంపల్లి గ్రామాల్లో మంగళవారం పలువురు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నాగపూరే బండు, యూత్ కన్వీనర్ కె.రాజు, నాయకులు వరలక్ష్మి, కమల, నాందేవ్, శివరాం, కార్తీక్, లహంచు, సాయి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.