
‘చట్టాల పేరుతో ఇబ్బంది పెట్టొద్దు’
కాగజ్‌నగర్‌రూరల్: అటవీ చట్టాల పేరుతో రైతుల ను ఇబ్బందులు పెట్టొద్దని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలో సోమవారం ఎఫ్‌డీవో సుశాంత్‌ను కలిసి సమస్యల పై చర్చించారు. మండలంలోని అంకుసాపూర్ గ్రా మస్తులు నిరుపేద కుటుంబానికి చెందిన వారని, వారు కేవలం తిండికోసమే పంట సాగు చేసుకుంటున్నారని వివరించారు. పేద రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎఫ్‌డీవో గ్రామస్తులతో చర్చించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ వసతులు పరిశీలించారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, నాయకులు నక్క మనోహర్, రాజు, వరలక్ష్మి, కమల తదితరులు పాల్గొన్నారు.