
శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం
ఆసిఫాబాద్‌అర్బన్: శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలు ప్రతిఒక్కరూ కొనసాగించాలని బీజే పీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, వన్ నేష న్– వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ పార్టీ కార్యాలయంలో సోమవారం శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వా రు మాట్లాడుతూ శ్యామప్రసాద్ ఆశయాలు, ఆలోచనలను అమలు చేస్తూ దేశాన్ని అభివృద్ధి చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్ని మతాలు, కులాల వారు అన్ని రంగాల్లో సమాన హక్కులు పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ప్రసాద్‌గౌడ్, శ్రీకాంత్, మాటూరి జయరాజ్, సదాశివ తదితరులు పాల్గొన్నారు.