
నీటి కోసం రోడ్డెక్కిన గిరిజనులు
కెరమెరి(ఆసిఫాబాద్): ఓ వైపు వర్షాలు పడుతున్నా జిల్లాలో తాగునీటి సమస్యలు తీరడం లేదు. కెరమె రి మండలం బాబేఝరి గ్రామ పంచాయతీకి చెంది న గిరిజనులు నీటి కోసం సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బిందెలతో రాస్తారో కో నిర్వహించారు. నెల రోజులుగా మిషన్ భగీరీథ నీరు సరఫరా కావడం లేదని, అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో చేతిపంపులు కూడా లేవని, ఉన్నవి కూడా నిరుపయోగంగా మారాయన్నారు. మట్టి, బురద వస్తుందనే కారణంతో నెల రోజులుగా నీరు అందించకుంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఎస్సై మధుకర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ విశ్వేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకున్నారు. రేపటి నుంచి నీటిని అందిస్తామని, సాధ్యం కాని పక్షంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమించారు. సుభాష్, గోపా ల్, మూట ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.