
‘ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే’
రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. రెబ్బెనలో సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం నిర్వహించారు. వారు మాట్లాడుతూఅసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తోందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు, నూతన రేషన్‌కార్డులు, 200యూనిట్ల లోపు ఉ చిత కరెంట్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్ర యాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటి హామీ లను ప్రభుత్వం అమలు చేసిందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అఖండ వి జయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చా రు. అనంతరం మండల అధ్యక్షుడు లావుడ్య రమేశ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవాజీ, నాయకులు సుదర్శన్‌గౌడ్, చిరంజీవిగౌడ్, మాజీ సర్పంచులు ప్రేందాస్, ఆత్మారాం తదితరులు పాల్గొన్నారు.