
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
వాంకిడి: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్య క్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కాంతిలా ల్ పాటిల్ సూచించారు. శనివారం వాంకిడి పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వివిధ సమస్యలతో వచ్చే ఫిర్యాదుదారులతో బాధ్యతగా మెలగాలని, సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాల ని ఆదేశించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పి స్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రశాంత్, సిబ్బంది ఉన్నారు.