
మెనూ ప్రకారం భోజనం అందించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అ న్నారు. మండలంలోని తుంపెల్లి ప్రభుత్వ పాఠశాలను గురువారం సందర్శించారు. మధ్యాహ్న భోజ నం, బడిబాటలో కార్యక్రమంలో విద్యార్థుల అడ్మిష న్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. నాణ్యమైన విద్య, భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
రైతులు, గ్రామస్తులు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని తుంపెల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును పర్యవేక్షించారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ రియాజ్ అలీ, డీటీ పోచయ్య, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.