
పుట్టుక.. చావులో వైవిధ్యం!
● ‘ఆడ’ కంటే ‘మగ’ జననమే అధికం
● అధిక మరణాలు కూడా పురుషులవే.. ● ఆగని గర్భస్త, నవజాత శిశు మరణాలు ● ‘సీఆర్‌ఎస్– 2021’ నివేదికలో వెల్లడి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పుట్టుక, చావు మానవ జీవనంలో కీలక ఘట్టాలు. దేశ వ్యాప్తంగా జనన, మరణాలను అధికారికంగా నమోదు చేసే కేంద్ర హోంశాఖ పరిధి రిజిస్ట్రార్ జనరల్, గణాంక కమిషనర్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సీఆర్‌ఎస్)–2021 నివేదిక ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదికలో ఉమ్మడి జిల్లాలో జననాలు, మరణాలతో పాటు ఏడాదిలోపు శిశువులు, గర్భంలోనే చనిపోతున్న శిశువుల వివరాల్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. ఇక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీ్త్ర, పురుష నిష్పత్తిలో ఏర్పడిన అసమానతలు, జనన, మరణాల్లో నమోదవుతున్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తున్నాయి.
కన్నుమూస్తే మరణం..
ఉమ్మడి ఆదిలాబాద్‌లో నిర్మల్ జిల్లాలో మరణాలు అధికంగా నమోదవుతుండగా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సంఖ్య తక్కువగా ఉంది. మహిళల కంటే మగవారి మరణాలే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వివరాల ప్రకారం 10,455మంది పురుషులు చనిపోతే, సీ్త్రలు 7,832 మంది మరణించారు.
మగ శిశువుల జననమే అధికం
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్ జిల్లాలో అధికంగా జననాలు నమోదవుతుండగా, కుమురంభీం ఆసిఫాబాద్‌లో తక్కువగా ఉంది. ఇందులో మగ శిశువుల జననాలే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆడ శిశువుల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో లింగనిష్పత్తి తగ్గుతుండగా ఈ నివేదికలోనూ ఇదే తీరువెల్లడైంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 26,576 మంది అబ్బాయిలు పుట్టగా, అమ్మాయిలు మాత్రం 25,124 మంది జన్మించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జననాలు..
జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం
పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం
ఆదిలాబాద్ 2,073 1,865 2,710 2,729 4,783 4,594 9,377
నిర్మల్ 4,490 4,218 7,002 6,599 11,492 10,817 22,309
మంచిర్యాల 333 320 5,377 5,065 5,710 5,385 11,095
కు.ఆసిఫాబాద్ 3,458 3,240 1,132 1,088 4,590 4,328 8,918
ఆందోళన కలిగిస్తున్న శిశు మరణాలు
శిశు మరణాలు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. పుట్టినప్పటి నుంచి మొదటి పుట్టిన రోజు కూడా జరుపుకోకుండానే ఎంతోమంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో పుట్టిన సమయంలోనే అనేక సమస్యలుండగా, కొందరు పెరిగే కొద్దీ వచ్చే అనారోగ్య కారణాలతో మృత్యువాత పడుతున్నారు. నిర్మల్ జిల్లాలో 84మంది, మంచిర్యాలలో గ్రామీణ ప్రాంతంలో ఒక్కరూ చనిపోనప్పటికీ.. పట్టణ ప్రాంతంలో 11మంది, ఆదిలాబాద్‌లో 61, కుమురంభీం ఆసిఫాబాద్‌లో అధికంగా 77మంది నవజాత శిశు మరణాలు నమోదయ్యాయి.
స్టిల్ బర్త్ మరణాలూ అధికమే..
20 వారాలు దాటిన పిండం నుంచి ప్రసవ దశ శిశువు వరకు గర్భంలోనే మరణించే స్థితిని స్టిల్ బర్త్‌గా పేర్కొంటారు. ఈ పరిస్థితిని చాలామంది గర్భిణులు ఎదుర్కొంటున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం ఈ జిల్లాలో 178 మృతశిశువుల జననాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ తర్వాత మంచిర్యాల జిల్లాలో గ్రామీణ పరిధిలో నమోదు లేనప్పటికీ పట్టణాల్లోనే 174 నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్‌లో 61, నిర్మల్‌లో 26 నమోదయ్యాయి. గర్భం దాల్చి పిండ వృద్ధి దశలో ఎదురవుతున్న పలు సమస్యలతో గర్భంలోనే ఈ మరణాలు సంభవిస్తున్నాయి.
శిశుమరణాలు ఇలా..
జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం
పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం
ఆదిలాబాద్ 27 18 10 06 37 24 61
నిర్మల్ 36 42 3 3 39 45 84
మంచిర్యాల 0 0 06 05 6 5 11
కు.ఆసిఫాబాద్ 43 29 02 03 45 32 77
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరణాలు..
జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం
పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం
ఆదిలాబాద్ 1,367 1,206 890 842 2,257 2,048 4,305
నిర్మల్ 2,400 1,850 1,356 1,054 3,756 2,904 6,660
మంచిర్యాల 653 574 1,636 1,003 2,289 1,577 3,866
కు.ఆసిఫాబాద్ 1,890 1,172 263 131 2,153 1,303 3,456
గర్భస్రావాలు (స్టిల్ బర్త్) ఇలా..
జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం
పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం
ఆదిలాబాద్ 21 20 14 06 35 26 61
నిర్మల్ 12 14 0 0 12 14 26
మంచిర్యాల 0 0 94 80 94 80 174
కు.ఆసిఫాబాద్ 98 74 04 02 102 76 178

పుట్టుక.. చావులో వైవిధ్యం!

పుట్టుక.. చావులో వైవిధ్యం!

పుట్టుక.. చావులో వైవిధ్యం!