ఆసిఫాబాద్‌అర్బన్: దేశవ్యాప్తంగా ఈ నెల 20న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెలో అన్ని విభాగాల సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ పిలుపునిచ్చారు. ఎన్‌హెచ్‌ఎం స్కీంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో కలిసి జిల్లా కేంద్రంలో డీఎంహెచ్‌వో సీతారాంకు మంగళవారం సమ్మె నోటీసు అందించారు. ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి రెండో ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్ చేయాలని, 7 నెలల పెండింగ్ పీఆర్సీ డబ్బులు విడుదల చేయాలని, నాలుగో తరగతి ఉద్యోగులకు కనీస వేతనంగా రూ.26వేలు చెల్లించాలని, బస్తీ దవాఖానాలో సపోర్టింగ్ స్టాఫ్‌ను కాంట్రాక్టు విధానంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆత్మకూరి చిరంజీవి, నాయకులు సురేశ్ పాల్గొన్నారు.