
పీసీ జైన్‌ను సన్మానిస్తున్న న్యాయవాదులు
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన న్యాయవాది బోనగిరి సతీశ్‌బాబు మూడోసారి విజయం సాధించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో ప్ర ధాన కార్యదర్శిగా రాపర్తి రవీందర్, ఉపాధ్యక్షుడిగా ఎండీ మునీర్ గెలుపొందారు. సంయు క్త కార్యదర్శిగా మౌళికర్ శ్రీనివాస్, కోశాధికారి గా మంథెన చరణ్ తేజ, లైబ్రరీ సెక్రెటరీగా ధీరజ్ భౌమిక్, స్పోర్ట్ అండ్ కల్చరల్ సెక్రెటరీగా ఉస్మాన్, లేడీస్ రిప్రెజెంటేటివ్‌గా గా యత్రిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది ప్రకాశ్‌చంద్ జైన్‌ను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. చీఫ్ అడ్వయిజర్‌లుగా సీని యర్ న్యాయవాదులు టి.సురేశ్, ఎం,సురేశ్, జగన్‌మోహన్‌రావు, వెంకటేశ్వర్లు, రవీందర్‌రెడ్డి, పీసీ జైన్‌ను ఎన్నుకున్నారు.