
మాట్లాడుతున్న టీజేఎస్ నాయకుడు బాబన్న
● టీజేఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.బాబన్న
పాతమంచిర్యాల: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.బాబన్న అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లీకేజీల వెనుక కేవలం ఇద్దరు ఉద్యోగుల హస్తం ఉందని మంత్రి కేటీఆర్ వాస్తవాలను పక్కదోవ పట్టించడమే అన్నారు. పాలకుల అసమర్ధత వల్లే ప్రశ్నాపత్రాలు లీకేజీ అవుతున్నాయని, అది పెద్దల అండదండలతో ఒక వ్యాపారంగా ఎదిగిందన్నారు. ఫలితంగా విద్యార్థులు భవిష్యత్‌పై నమ్మకం కోల్పోయారన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోనేల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ప్రదీప్, విద్యార్థి యువజన సమితి జిల్లా అధ్యక్షుడు ఎండీ సిరాజ్, నాయకులు ప్రవీణ్, సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవి సత్యం, మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జైపాల్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.