
మాట్లాడుతున్న రామిల్ల రాధిక
మందమర్రిరూరల్(చెన్నూర్): డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలివ్వాలని సంఘం అధ్యక్షురాలు రామిల్ల రాధిక డిమాండ్ చేశారు. బుధవారం వివిధ పార్టీల నాయకులతో కలిసి దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమకు ఉద్యోగ అవకాశం కల్పించాలని డిస్మిస్ కార్మికులు 19 సంవత్సరాలుగా దీక్ష చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. ప్రతిరోజు దీక్షా శిబిరం ముందునుంచే కార్యకలాపాలకోసం వెళ్లే నాయకులు, అధికారులకు కార్మికుల గోడు కనిపించడంలేదన్నారు. సింగరేణి గుర్తింపు, సాధారణ ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా ఉద్యోగాలు ఇచ్చేలా కృషి చేయాలన్నారు. ఆమె వెంట బీజేపీ నాయకులు నర్సింగ్, దీక్షితులు, సంఘం నాయకులు రవీందర్ ఉన్నారు.