వాతావరణ ం
గరిష్టం / కనిష్టం
290 / 200
జిల్లాలో బుధవారం ఉదయం, రాత్రి చలి ప్రభావం పెరిగే అవకాశముంది. మధ్యాహ్నం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి.
భూనిర్వాసితులకు
అత్యధిక పరిహారం
కలెక్టర్ అనుదీప్
ఖమ్మం సహకారనగర్: సీతారామ ఎత్తిపోతల పథకం సంబంధించి భూములు ఇచ్చే రైతులకు నిబంధనల మేరకు అత్యధిక పరిహారం చెల్లించేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన సింగరేణి మండలం బాజుమల్లాయిగూ డెం, రేలకాయలపల్లి గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. సీతారామ ఎత్తిపోతల పథకం 13వ ప్యాకేజీ నిమిత్తం సేకరించాల్సిన భూమి, పరిహారంపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్ వారితో చర్చించారు. బాజుమల్లాయిగూడెంలో ఎకరా భూమి ధర రూ.2.70 లక్షలు ఉండగా రెండింతలు అంటే రూ.5.40లక్షలుగా పరిగణనలోకి తీసుకుని రెట్టింపు పరిహారం చేసి రూ.10.80లక్షలను ప్రభుత్వం చెల్లించనుందని తెలిపారు. ఇక ఆర్బిట్రేషన్‌లో 12 శాతం వడ్డీ రూ.64వేలు కలిపితే రూ.11.44లక్షలు అందుతాయని చెప్పారు. అలాగే, రేలకాయలపల్లిలో ఎకరా ధర రూ.2.92లక్షలు ఉండగా, వడ్డీ కలిపి రూ.12.40లక్షల చొప్పున చెలిస్తామని తెలిపారు. అంతేకాక పొలాల్లో సుబాబుల్ పంట, ఇతర చెట్లు, పైపు లైన్లు, డ్రిప్ పరికరాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో ఎస్‌డీసీ ఎం.రాజేశ్వరితోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు


