నివేదికలు సకాలంలో సమర్పించాలి
ఖమ్మంవైద్యవిభాగం: ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారు, మందుల లభ్యత తదితర వివరాల నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో సమర్పించాలని డీఎంహెచ్‌ఓ డి.రామారావు సూచించారు. ఖమ్మంలోని వెంకటేశ్వరనగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది హాజరును పరిశీలించాక షెడ్యూల్ ప్రకారం హెచ్‌ఐవీ, రక్తదానం, సరఫరాపై అవగాహన కల్పించారా? అని ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం మరింత పెంచాలని సూచించారు. డాక్టర్ దేవిశ్రీ, ఉద్యోగులు రజని, శారద, లక్ష్మీప్రసన్న, రహీంబీ, సంధ్య, కావ్య, శిరీష, ఉమారాణి, ముదస్సర్, షమీమ్ తదితరులు పాల్గొన్నారు.


