కేసీఆర్ హయాంలో గ్రామాల అభివృద్ధి
వైరారూరల్: సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడే గ్రామాల అభివృద్ధి జరిగిందని.. ఇప్పుడు ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ విమర్శించారు. వైరా మండలం కేజీ సిరిపురంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల పాలన ప్రతీ గ్రామం అభివృద్ధి చెందిందని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పల్లె పాలనను పట్టించుకోకపోగా వైకుంఠధామాలు, రైతు వేదికలు అధ్వానంగా మారాయని చెప్పా రు. అంతేకాక రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని ఆరోపించారు. కాగా, ఎమ్మెల్యేలు, మంత్రులు జీపీ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఫోన్ చేసి కాంగ్రెస్ చేరాలని, తద్వారా కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ మభ్య పెడుతున్నారని విమర్శించారు. అంతేకాక జిల్లాలో 42శాతం కాకుండా బీసీలకు కేవలం 9శాతం మందికే సీట్లు ఇచ్చారని మధు తెలిపారు. ఈసమావేశంలో నాయకులు మద్దెల రవి, కట్టా కృష్ణార్జున్‌రావు, కామినేని శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, అయినాల కనకరత్నం తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు


