రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లా జట్ల ప్రతిభ
ఖమ్మంస్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–17 బాలబాలికల టేబుల్ టెన్నిస్ పోటీలు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం ముగిశాయి. బాలుర విభాగంలో విజేతగా హైదరాబాద్ నిలవగా, రంగారెడ్డి, ఖమ్మం జట్లు ఆ తర్వాత స్థానాలు దక్కించుకున్నాయి. బాలికల విభాగంలో రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్ జట్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. పాత పది జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో మ్యాచ్‌లను నాకౌట్ పద్ధతిలో నిర్వహించారు. కాగా, టోర్నీని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్, జిల్లా పాఠశాలల క్రీడల సంఘం సలహాదారుడు దేవరకొండ సైదులు ప్రారంభించారు. జిల్లా పాఠశాలల క్రీడల సంఘం కార్యదర్శి వై.రామారావు, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్‌కుమార్, సాంబమూర్తితో పాటు ప్రవీణ్‌కుమార్, నాగుల్‌మీరా, కృష్ణ, అంజయ్య, సైదేశ్వర్‌రావు పాల్గొన్నారు.
జిల్లా కబడ్డీ
బాలుర జట్టుకు శిక్షణ
కల్లూరు: మహబూబ్‌నగర్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా బాలుర కబడ్డీ జట్టుకు కల్లూరు మినీ స్టేడియంలో శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 20 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా ప్రతిభ కనబర్చిన వారితో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జట్టును ఎంపిక చేస్తామని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరు దయాకర్‌రెడ్డి, కటికల క్రిస్టోఫర్‌బాబు తెలిపారు. కాగా, క్రీడాకారులకు క్రీడా దుస్తులు, వసతితో పాటు భోజనం, అల్పాహారాన్ని పీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సమకూరుస్తోంది. శిబిరం ఇన్‌చార్జ్‌లుగా జి.శ్రీనివాస్, గౌతమ్ గోపాలరావు, సీనియర్ క్రీడాకారులు వ్యవహరిస్తున్నారు.
బాలికల విభాగంలో రన్నరప్,
తృతీయస్థానంలో బాలురు


