పలు పంచాయతీలు ఏకగ్రీవం
కారేపల్లి: కారేపల్లి మండలంలోని గిద్దెవారిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్‌ను ఏకగ్రీవం చేసుకునేందుకు మంగళవారం గ్రామస్తులు సమావేశమయ్యా రు. ఈమేరకు ఈసాల నాగేశ్వరరావు పేరు ఖరారు చేసి 3వ తేదీన మొదలయ్యే ప్రక్రియలో ఆయనతో మాత్రమే నామినేషన్ వేయించేలా తీర్మానించారు. కాగా, నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో కొనసాగుతుండగా ఆయన భార్య ఛాయాదేవి కాంగ్రెస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలుగా ఉన్నారు. తనను ఏకగ్రీవం చేసినందున గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠ, ఆంజనేయస్వామి గుడి నిర్మాణానికి అయ్యే ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
తల్లాడ: ఒకప్పుడు గొడవలకు నిలయంగా ఉన్న తల్లాడ మండలం బస్వాపురంలో మూడు పార్టీల నాయకులు కలిసి సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఎం కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టేలా మంగళవారం జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. ఈమేరకు సర్పంచ్ స్థానానికి పాశం హైమావతిని నిలబెట్టడంతో పాటు బీఆర్‌ఎస్‌కు ఉప సర్పంచ్, ఒక వార్డు, కాంగ్రెస్‌కు, సీపీఎంకు మూడు వార్డులు కేటాయించేలా ఒప్పందం కుదిరింది.
వైరారూరల్: వైరా మండలంలోని 22 గ్రామపంచాయతీ ల కు గాను పుణ్యపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ నుంచి యంగల మరియమ్మ, ఎనిమిది మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై న విషయం విదితమే. ఇక గోవిందపురం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ తరపున రంగశెట్టి కళావతితో పాటు మరో ము గ్గురు నామినేషన్లు దాఖలుచేశారు. వీరిలోఇద్దరు మం గళవారం నామినేషన్లు విత్‌డ్రా చేసుకోగా కళావతి ఏకగ్రీవమైనట్లయింది. ఈగ్రామంలో ఎనిమిది వార్డు స్థానాలకు కూడా ఒక్కో నామినేషనే దాఖలైంది.
తిరుమలాయపాలెం: మండలంలోని తిమ్మక్కపేట సర్పంచ్ అభ్యర్థిగా మాస్‌లైన్‌కు చెందిన రేపాకుల సుభద్ర అన్ని పార్టీల ఏకగ్రీవ ఆమోదంతో నామినేషన్ దాఖలు చేశారు. దీంతో సర్పంచ్‌గా సుభద్ర ఎన్నిక లాంఛనమే కానుంది. అలాగే, గ్రామంలో ఎనిమిది వార్డు స్థానాలకు కూడా ఒక్కో నామినేషనే దాఖలైంది.
పలు పంచాయతీలు ఏకగ్రీవం


