జింకలకు ఉచ్చు వేసిన ఐదుగురు అరెస్ట్
పాల్వంచరూరల్: కిన్నెరసాని డీర్ పార్కులోని జింకలను చంపేందుకు విద్యుత్ తీగలతో ఉచ్చు వేసిన ఐదుగురిని వైల్డ్‌లైఫ్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. మండలంలోని యానంబైల్ రేంజ్ పరిధి కిన్నెరసాని డీర్ పార్కు శివారులో సోమవారం రాత్రి విద్యుత్ ఉచ్చులు వేసినట్లు సమాచారం అందుకున్న వైల్డ్‌లైఫ్ సిబ్బంది బి.కిషన్, నగేశ్, వాచర్స్ కల్యాణ్, ఇబ్రహీం ఘటనా ప్రదేశానికి వెళ్లారు. ఉచ్చులు వేసిన, రాజాపురం గ్రామానికి చెందిన గుమ్మడి వెంకటేశ్వర్లు, కల్తీ శ్రావంత్, పడిగే శ్రీను, కల్తీ నర్సింహారావు, యానంబైల్ గ్రామానికి చెందిన గుమ్మడి నాగేశ్వరరావును పట్టుకుని విద్యుత్ ఉచ్చులను స్వాధీనం చేసుకున్నారు.


