స్థానిక సంస్థల్లో విజయమే లక్ష్యం
డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ
ఖమ్మంమయూరిసెంటర్:జిల్లావ్యాప్తంగా అత్యధిక గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల ను గెలిపించేలా పార్టీ శ్రేణులు పాటుపడాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారా యణ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఏఐసీసీ, పీసీసీ బాధ్యులకే కాక తన బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరైన నేతలకు ఆయన ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించ డం ద్వారా జిల్లా పార్టీ కంచుకోట అని రుజువు చేయాలని కోరారు.
108 ఉద్యోగులకు
శిక్షణ తరగతులు
ఖమ్మంవైద్యవిభాగం: ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని 108 వాహనాల్లో పనిచేస్తున్న ఈఎంటీ, డ్రైవర్ల (పైలట్లు) కు మంగళవారం ఖమ్మం జనరల్ ఆస్పత్రిలో శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్ గ్రీన్‌హెల్త్ సర్వీస్ కు చెందిన పార్వతమ్మ సాధారణ, కష్టంతరమైన ప్రసవాలు చేయడంపై ఈఎంటీలకు అవగాహన కల్పించారు. అలాగే, పైలట్లకు డ్రైవింగ్‌లో మెళకువలు, క్షతగాత్రుల తరలింపు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. 108 జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ పాటి శివకుమార్, జిల్లా ఎమర్జెన్సీ మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల ఉద్యోగులు మహేశ్, సతీశ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల బలోపేతంలో ఉపాధ్యాయులే కీలకం
మధిర: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాలని విద్యాశాఖ జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్‌రెడ్డి సూచించారు. మధిర సీపీఎస్ ఉన్నత పాఠశాల, మడుపల్లిలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలను మంగళవారం సందర్శించిన ఆయన హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగేలా మెరుగైన బోధన అందించాలని తెలిపారు. ఇందుకోసం టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీపీఎస్ గ్రంథాలయానికి రూ.3 వేల విలువైన పుస్తకాలను ఆయన అందజేశారు. ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
క్లీన్ ఖిల్లా..
ఖమ్మంమయూరిసెంటర్:నగరంలోనిఖిల్లాపై చెట్లు, పిచ్చిమొక్కలు, కంప తొలగింపు పనులు చివరి దశకు చేరాయి. ఖిల్లాపై కంప చెట్లు పెరగడం, భారీవృక్షాలు ఉండడంతో పైకి వెళ్లడానికి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రోప్‌వే నిర్మాణం చేపడుతుండగా మొక్కలను కేఎంసీ డీఆర్‌ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు. మూడు వారాలుగా జరుగుతున్న పనులు చివరి దశకు చేరడంతో ఖిల్లాపై, పరిసరాలు శుభ్రమయ్యాయి.
స్థానిక సంస్థల్లో విజయమే లక్ష్యం
స్థానిక సంస్థల్లో విజయమే లక్ష్యం
స్థానిక సంస్థల్లో విజయమే లక్ష్యం


