ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రెండురోజుల్లో రెండు వేల ఖాతాలు !
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని సూచించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం మాట్లాడిన ఆమె పలు సూచనలు చేశారు. రెండో విడత నామినేషన్ల పరిశీలన పకడ్బందీగా నిర్వహించాలని, మూడో విడత నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అనంతరం ఉద్యోగుల కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్లు, బ్యాలెట్ బాక్సులపై చర్చించారు. జిల్లా నుంచి ఎన్నికల పరిశీలకుడు ఖర్తడే కాళీచరణ్ సుధామరావు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు సాఫీగా సాగుతున్నాయని తెలిపారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ మాట్లాడగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, డీఆర్వో ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ ఆశాలత, సీపీఓ శ్రీనివాస్, డీసీఓ గంగాధర్, డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


