పారాలీగల్‌ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పారాలీగల్‌ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలి

Jul 5 2025 6:34 AM | Updated on Jul 5 2025 6:34 AM

పారాల

పారాలీగల్‌ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలి

ఖమ్మం లీగల్‌: ఆసక్తి కలిగిన న్యాయ విద్యార్థులు పారా లీగల్‌ వలంటీర్లుగా నమోదు చేసుకుంటే అవసరమైన వారికి న్యాయసహాయం అందించొచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన న్యాయ విద్యార్థులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన, న్యాయసాయం కోసం ధనం వెచ్చించలేని వారికి సంస్థ ద్వారా ఉచిత సహాయం అందుతుందని తెలిపారు. ఈక్రమంలో విద్యార్థులు వలంటీర్లు నమోదైతే అర్హులకు సాయం అందేలా కృషి చేయొచ్చని చెప్పారు. న్యాయవాది పి.సంధ్యారాణి, మానేరు లా కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నంద చిరంజీవి, అధ్యాపకులు నూరేన్‌, హరీశ్‌, రేహాన్‌, లావణ్య పాల్గొన్నారు.

సాగర్‌ నుంచి పాలేరుకు

నీటి విడుదల

నాగార్జునసాగర్‌/కూసుమంచి: పాలేరు రిజ ర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గడంతో తాగునీటి సమస్య ఎదురుకాకుండా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి 3వేల క్యూసెక్కుల నీటి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం సాగునీటి శాఖ అధికారులు ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా నీరు విడుదల చేశారు. మొదట వేయి క్యూసెక్కులు విడుదల చేయగా, క్రమంగా మూడు వేల క్యూసెక్కులకు పెంచుతూ ఐదు రోజులు విడుదల చేస్తామని డ్యాం ఎస్‌ఈ మల్లికార్జున్‌ తెలిపారు. ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం 12.30 అడుగులకు పడిపోగా, సాగర్‌ జలాలు శనివారం రాత్రి వరకు చేరనుండడంతో నీటిమట్టం పెరగనుంది. తద్వారా ఖమ్మం, వరంగల్‌, మహ బూబాబాద్‌ జిల్లాలకు తాగునీటి విడుదల సాఫీగా సాగనుంది.

డీసీఈబీ సెక్రటరీగా

వెంకటేశ్వర్లు

ఖమ్మం సహకారనగర్‌: డిస్ట్రిక్ట్‌ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు(డీసీఈబీ) సెక్రటరీగా కనపర్తి వెంకటేశ్వర్లును నియమిస్తూ డీఈఓ ఎస్‌.సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చింతకాని మండలం నాగులవంచ హెచ్‌ఎంగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లును సెక్రటరీగానే కాక మరో పది మందిని మూడేళ్ల కాలానికి సభ్యులుగా నియమించారు. సభ్యుల్లో జెడ్పీ, ప్రభుత్వ, కేజీబీవీ, రెసిడెన్షియల్‌, ప్రైవేట్‌ పాఠశాలల హెచ్‌ఎంలు ఉన్నారు. కాగా, వెంకటేశ్వర్లు గతంలోనూ డీసీఈబీ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ఈమేరకు డీసీఈబీ కార్యదర్శి, సభ్యులను టీజీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కస్తాల సత్యనారాయణ, మోదుగు వేలాద్రి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కట్టా శేఖర్‌రావు, రంగారావు, మోత్కూరి మధు, రంజాన్‌, పారుపల్లి నాగేశ్వరరావు, ఏ.వీ.నాగేశ్వరరావు, వెంగళరావు, మోత్కూరి మధు, యలమద్ది వెంకటేశ్వర్లు తదితరులు అభినందించారు.

సర్టిఫికెట్ల పరిశీలన

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)ల్లో ఖాళీగా ఉన్న సీఆర్‌టీ, పీజీ సీఆర్‌టీ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన అధికారులు అభ్యర్థుల సర్టిఫికెట్లను శుక్రవారం డీఈఓ కార్యాలయంలో పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులు అజిత, శివకుమారి సర్టిఫికెట్లు పరిశీలించగా జీసీడీఓ తులసి పర్యవేక్షించారు. ఈకార్యక్రమంలో డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

పారాలీగల్‌ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలి
1
1/3

పారాలీగల్‌ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలి

పారాలీగల్‌ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలి
2
2/3

పారాలీగల్‌ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలి

పారాలీగల్‌ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలి
3
3/3

పారాలీగల్‌ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement