‘ఆమె’కు తొలి ఫలితం | - | Sakshi
Sakshi News home page

‘ఆమె’కు తొలి ఫలితం

Jul 5 2025 6:34 AM | Updated on Jul 5 2025 6:34 AM

‘ఆమె’

‘ఆమె’కు తొలి ఫలితం

ఆనందంగా ఉంది..

మండల సమాఖ్య ద్వారా బస్సు కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించాం. సంస్థ నుండి తొలి నెల ఆద్దె విడుదల చేయడం ఆనందంగా ఉంది. నెలనెలా అద్దె వస్తే ఈఎంఐ కడుతూ బాకీ తీరుస్తాం. మిగిలిన నగదుతో మా సమాఖ్యలోని సభ్యులకు ఆర్థిక భరోసా లభిస్తుంది. – మరియమ్మ,

వైరా మండల సమాఖ్య అధ్యక్షురాలు

ఖమ్మంమయూరిసెంటర్‌: మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా పలు అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడమే కాక ఆ రుణంతో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన అప్పగించారు. తద్వారా నెలవారీగా అద్దెతో రుణ వాయిదా చెల్లించి, మిగతా నగదును సభ్యులకు రుణం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. బస్సు బకాయి తీరాక సంఘాలకే అద్దె మొత్తం అందనుంది. ఈమేరకు మే 20వ తేదీన ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన బస్సులు అప్పగించడంతో జూన్‌ 20వ తేదీ నాటికి ఒక నెలకు సంబంధించి అద్దెను సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ నిధులను సంఘాల వారీగా అధికారులు శనివారం అందించనుండడంతో తొలి ఫలితం దక్కనుందని మహిళా సంఘాల సభ్యుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఉమ్మడి జిల్లాలో 21 బస్సులు..

టీజీఎస్‌ ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన ఇచ్చేలా మండల సమాఖ్యల ద్వారా బస్సులు కొనుగోలు చేయించారు. ఉమ్మడి జిల్లాలో 31 సంఘాలకు తొలిదశలో అవకాశం కల్పించగా ఇప్పటి వరకు 21 బస్సులను సమకూర్చారు. ఖమ్మం జిల్లాలో 19, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు మండల సమాఖ్యల ద్వారా రూ.36 లక్షల చొప్పున ఒక్కో బస్సు కొనుగోలు చేశారు. ఆర్టీసీ ద్వారా అందే అద్దెను ఏడేళ్ల పాటు(84నెలలు) మండల సమాఖ్యల ద్వారా జిల్లా సమాఖ్య లేదా రుణం జారీ చేసిన బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది.

ఈఎంఐ చెల్లింపులు, వినియోగం

ఆర్టీసీ ప్రతి నెలా 21నుంచి 25వ తేదీ మధ్య మండల మహిళా సమాఖ్యల ఖాతాల్లో అద్దె జమ చేస్తుంది. ఒక్కో బస్సుకు అద్దె రూపంలో రూ.69,468 జమ చేయనుండడంతో ఇందులో రూ.50వేలను కిస్తీగా చెల్లించాలి. మిగతా రూ.19,468 నగదును మహిళా సమాఖ్యల ఖాతా ద్వారా అవసరాలకు అనుగుణంగా సభ్యులు రుణంగా తీసుకోవచ్చు. కాగా, ఆర్టీసీ యాజమాన్యం బస్సులకు సంబంధించిన తొలి నెల అద్దె విడుదల చేయడంతో ఉమ్మడి జిల్లాలోని మహిళా సమాఖ్యల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మహిళా సంఘాల ద్వారా

ఆర్టీసీకి అద్దె బస్సులు

నేడు మొదటి నెల అద్దె చెల్లించనున్న అధికారులు

ఉమ్మడి జిల్లాలో

21 మండల సమాఖ్యలకు లబ్ధి

‘ఆమె’కు తొలి ఫలితం1
1/1

‘ఆమె’కు తొలి ఫలితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement