
పదోన్నతులు, బదిలీలపై దృష్టి సారించాలి
చింతకాని: ప్రభుత్వం ఇకనైనా ఉపాధ్యాయులు, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలపై దృష్టి సారించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాభవాని డిమాండ్ చేశారు. చింతకాని మండలంలోని పలు పాఠశాలలను గురువారం సందర్శించిన ఆమె నాయకులతో కలిసి సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా దుర్గాభవాని మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాక పెండింగ్ బిల్లులు, డీఏలను విడుదల చేయాలన్నారు. అలాగే, కేజీబీవీ, యూఆర్‌ఎస్, ఆశ్రమ పాఠశాలల కాంట్రా క్ట్ ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలపు వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, కేజీ తరగతులను ప్రవేశపెట్టి ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని కోరారు. ఇదేసమయాన పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆమె సూచించారు. టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణ, తోటకూరి శ్రీనివాసరావు, నాయకులు నాగేశ్వరరావు, భాగ్య, ప్రీతమ్, జమలయ్య, అనిల్, సురేష్, రాజయ్య, పుల్లారావు, శశికుమార్, కృష్ణారావు, పాషా, మహేశ్వర్, వాసు, ఖాదర్, శ్రీనివాసరావు, శంకర్‌రెడ్డి, భిక్షం, వెంకటేశ్వర్లు, కిషన్, పూర్ణచందర్‌రావు, సంపత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
దుర్గాభవాని