
ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి
ఖమ్మం సహకారనగర్ : రాష్ట్ర అవతరణ దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలన్నారు. ప్రజాప్రతినిధులు పాల్గొనే కార్యక్రమాల్లో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు లేకుండా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో జూన్ 2న ఉదయం 8:15 గంటలకు పతాకావిష్కరణ చేయాలన్నారు. ఆ తర్వాత అమరవీరుల స్థూపం వద్ద నివాళులు, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలల అనంతరం కలెక్టరేట్‌లో పతాకావిష్కరణ ఉంటుందని, జిల్లా అధికారులు, సిబ్బంది కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని, అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయాలని అన్నారు. సాయంత్రం లకారం ట్యాంక్‌బండ్ వద్ద ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్వో ఎం.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్