
51 జంటలకు సామూహిక వివాహాలు
కొత్తగూడెంరూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం గ్రామంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వివాహాలు జరిపించారు. త్రిదండి దేవనాథ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వేడుకకు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన 51 జంటలు హాజరై సామూహిక వివాహాలు చేసుకున్నాయి. నూతన వధూవరులకు గ్రామానికి చెందిన కొండపల్లి సాయిగోపాల్ – సుజాత దంపతులు వధూవరులకు మంగళసూత్రాలు, నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం వధూవరులతో పాటు బంధు, మిత్రులకు భోజనం కూడా ఏర్పాటు చేశారు. కాగా, సాయిగోపాల్ దంపతులు గత 18 సంవత్సరాలు గా ప్రతీ వైశాఖ శుద్ధ దశమి రోజున సామూహిక వివాహ వేడుకలు నిర్వహిస్తుండడం విశేషం. నూత న జంటలను వసుంధర సుమంగళి వస్త్రాలయం అధినేత తాటిపల్లి శంకర్‌బాబు దంపతులు, కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి, ఆళ్ల మురళి, కోనేరు సత్యనారాయణ, ఊకంటి గోపాల్‌రావు, డాక్టర్ శంకర్‌నాయక్ తదితరులు ఆశీర్వదించారు.

51 జంటలకు సామూహిక వివాహాలు