ఎయిడ్స్‌పై జాగృతి జాతా
రాయచూరు రూరల్: సమాజంలో ఎయిడ్స్ మహమ్మారిపై ముమ్మర ప్రచారం చేపట్టాలని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆరోగ్య శాఖ, రెడ్ రిబ్బన్, రిమ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తులతో జాగృతి జాతాను ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఈ వ్యాధికి గురైన వారిని చిన్న చూపు చూడటం తగదన్నారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలన్నారు. జాతాలో జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సురేంద్రబాబు, ఎయిడ్స్ నోడల్ అధికారి గణేష్, నందిత, మనోహర్ పత్తార్‌లున్నారు.
గ్యాంగ్‌స్టర్ చిత్రంతో
అంజనాద్రికి భక్తుడు
సాక్షి బళ్లారి: మహారాష్ట్రలోని ముంబైలో గ్యాంగ్‌స్టర్‌గా పేరు గాంచిన లారెన్స్ బిష్ణోయి చిత్రం పట్టుకొని అంజనాద్రి కొండకు ఓ భక్తుడు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా కోళివాడ గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు తొమ్మిది రోజుల పాటు హనుమ మాలను ధరించి భక్తిశ్రద్ధలతో హనుమంతుడిని పూజించారు. అనంతరం అంజనాద్రికి రావడంతో సదరు భక్తుడు హనుమ మాలపై లారెన్స్ బిష్ణోయి చిత్రం పట్టుకొని రావడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
వైకుంఠ రథం పంపిణీ
రాయచూరు రూరల్: మైనార్టీ సోదరుల అంత్యక్రియలకు జనాజా వాహనా(వైకుంఠ రథా)న్ని విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్ పంపిణీ చేశారు. బుధవారం నగరంలోని బందేనవాజ్ కాలనీలో మైనార్టీ సోదర సోదరీమణుల మృతదేహాలను సాగనంపడానికి రూ.20 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన రెండు రిఫ్రిజిరేటర్లు, జనాజా వాహనం అందించారు. ఈ సందర్భంగా మాజీ నగరసభ సభ్యుడు బాబర్, అబ్దుల్ కరీం, మహ్మద్ సుల్తాన్, సయ్యద్, ఖాజా మోయినుద్దీన్, మహ్మద్ అహ్మద్ హుసేన్, రహీం ఖురేషీ, అహ్మద్ రాజ్, ఖలీం, అల్లా భక్షి, అస్లాం, జాఫర్ ఖాన్, ఖాజాహుసేన్‌లున్నారు.
గ్రోత్ సెంటర్‌లో
సమస్యలు తీర్చరూ
రాయచూరు రూరల్: రాయచూరు గ్రోత్ సెంటర్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కరవే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జావిద్ ఖాన్ మాట్లాడారు. రాయచూరు గ్రోత్ సెంటర్ పరిధిలో వడ్లూరు, చిక్కసూగూరు, హెగ్గసనహళ్లిలో ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. టెక్సాటాన్ స్టీల్ పరిశ్రమలు ఉండడంతో ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గ్రామాల ప్రజలు పలు వ్యాధుల బారిన పడుతున్నారని, ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ సురేష్‌వర్మకు వినతిపత్రం సమర్పించారు.
నేడు సిద్దలింగేశ్వర స్వామి జాతర, రథోత్సవం
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకాలోని మన్సలాపూర్‌లో గురువారం సిద్దలింగేశ్వర జాతర, రథోత్సవాలు జరగనున్నాయి. కిల్లే బృహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్య, సుల్తాన్‌పుర శంభు సోమనాథ శివాచార్యుల ఆధ్వర్యంలో వేలాది మంది భక్తుల సమక్షంలో జాతర రథోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.
ఎయిడ్స్‌పై జాగృతి జాతా
ఎయిడ్స్‌పై జాగృతి జాతా
ఎయిడ్స్‌పై జాగృతి జాతా


