ఆంజనేయా.. పాహిమాం
హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలో ఉన్న హనుమంతుని జన్మస్థలం అంజనాద్రిలో వేలాది మంది హనుమ మాలధారులు రాముని వద్ద బారులు తీరి నిలబడి శ్రీ జయరాం, పవనసుత ఆంజనేయ జయ జయ ఘోషలతో హనుమ నామాన్ని జపిస్తూ ఆంజనేయస్వామి దర్శనం చేసుకున్నారు. గత అనేక సంవత్సరాలుగా అంజనాద్రికి హనుమమాల ధరించి వచ్చే హనుమ భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఆలయానికి వచ్చే భక్తులకు తాత్కాలిక స్నాన గదులు, మరుగుదొడ్లు, వసతి, వాహనాల పార్కింగ్ వంటి అవసరమైన సౌకర్యాలను జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ భద్రతా వ్యవస్థను కల్పించింది. మాలధారులకు దర్శనం తర్వాత వేద పాఠశాలలో గోధుమ హుగ్గి, అన్న ప్రసాదం ఏర్పాట్లు చేశారు. హనుమ మాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఎక్కువ భోజన కౌంటర్లను ఏర్పాటు చేశారు. కొండ మెట్ల వద్ద భక్తులకు ముందు జాగ్రత్తగా ఆరోగ్య శాఖ అధికారుల బృందాలను నియమించారు. వివిధ వైపుల నుంచి అంజనాద్రికి వచ్చే వాహనాలకు సుగమ సంచార వ్యవస్థ ఏర్పాటుకు పోలీస్ శాఖ తగిన బందోబస్తును కల్పించారు.
అంజనాద్రికి పోటెత్తిన భక్తులు
భక్తిశ్రద్ధలతో హనుమ మాల దీక్ష
ఆంజనేయా.. పాహిమాం


