త్వరితగతిన డ్యాం గేట్లను అమర్చండి
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్లను త్వరితగతిన అమర్చాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి మునిరాబాద్‌లో జరిగిన తుంగభద్ర బోర్డు అధికారుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు ఇబ్బంది కలగకుండా వచ్చే ఖరీఫ్ నాటికి క్రస్ట్‌గేట్లు అమర్చే పనులను పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే రూ.20 కోట్ల వ్యయంతో రూపొందించిన క్రస్ట్‌గేట్ల అమరికకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కర్ణాటక ప్రభుత్వానికి రూ.10 కోట్ల నిధుల విడుదలకు ప్రతిపాదనలు సమర్పించామన్నారు. మరో 18 క్రస్ట్‌గేట్లు తయారవుతున్నాయన్నారు. ఈనెల 5న క్రస్ట్‌గేట్లపై ఉన్న క్యాప్‌ల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు నది ద్వారా 7 టీఎంసీలు, తెలంగాణకు 5 టీఎంసీలు కలిపి మొత్తం 12 టీఎంసీల నీటిని విడుదల చేస్తారన్నారు. సమావేశంలో మాజీ మంత్రి మల్లికార్జున నాగప్ప, చీఫ్ ఇంజినీర్ లక్ష్మణ్ నాయక్, ఎస్‌ఈ సత్యనారాయణ, గిరీష్, విజయలక్ష్మి, శాంతరాజ్, గోడేకర్, కాంగ్రెస్ నేతలు శాంతప్ప, దొడ్డబసప్పగౌడ, అమరేగౌడలున్నారు.
వచ్చే ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేయాలి
అధికారులకు మంత్రి బోసురాజు సూచన


