భీమసేన ఆలయ ఉత్సవాలు ప్రారంభం
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లా సేడం తాలూకా మోతకపల్లిలో వెలసిన బల భీమ సేన ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి ఆలయంలో భక్తులు జ్యోతులు వెలిగించారు. మంగళవారం తెల్లవారు జామున స్వామి విగ్రహానికి పల్లకీలో సేవలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని సేవించి బల భీమ సేన ఆంజనేయ స్వామి దర్శనం పొందారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మోతకపల్లిలోని ఆలయంలో
మూడు రోజుల పాటు విశేష పూజలు
భీమసేన ఆలయ ఉత్సవాలు ప్రారంభం
భీమసేన ఆలయ ఉత్సవాలు ప్రారంభం


