ఇంటి వద్దకే ఈ–ఖాతాలు
రాయచూరు రూరల్: నగరంలో రెవెన్యూ వసూళ్లలో ముందుండాలని, ఇంటి వద్దకే ఈ–ఖాతాల పంపిణీకి శ్రీకారం చుట్టాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అధికారులను ఆదేశించారు. నగరసభ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు, బిల్ కలెక్టర్లకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. నగరంలో 8 జట్లను ఏర్పాటు చేసి నిర్ణీత సమయంలో ఇంటి పన్ను, నీటి పన్ను వసూలును పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ నగరసభ పేరుతో ఈ–ఖాతాలను త్వరగా ఇస్తారన్నారు. నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, నగరసభ సభ్యులు జయన్న, శాంతప్పలున్నారు.


