కుక్కల బెడదకు మోక్షమెన్నడో?
రాయచూరు రూరల్: జిల్లా కేంద్రం రాయచూరులో కుక్కల గోల తప్పేదెన్నడు? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏ వీధిలో చూసినా కుక్కలు స్వైరవిహారం చేస్తూ పిల్లలను కరుస్తున్నాయి. మరో వైపు చర్మ వ్యాధులు సోకినట్లు ప్రచారం పెల్లు బుకడంతో ప్రజలు పలు ఇబ్బందులకు గురై ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయంలో నిద్ర పోకుండా మొరుగుతూనే ఉంటాయి. వీధి కుక్కల గొడవ ఒక ఎత్తయితే, కుక్కలు కరుస్తాయని పరుగెత్తి వాటి నుంచి రక్షణ పొందాలనుకుంటే రహదారి మధ్యలో కుక్కలు పెంచుకున్న యజమానులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో దాదాపు 900కు పైగా కుక్కలున్నట్లు అంచనా. రాత్రి వేళ రహదారిలో యథేచ్చగా రహదారిపై పడుకొని ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గత వారం రోజుల్లో 100 మందికి కుక్కలు కాటు వేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మడ్డిపేటకు చెందిన ఓ యువతి కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నగరసభ అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపి తగిన చర్యలు తీసుకొని కుక్కలను సుదూరంలో విడిచి పెట్టాలని కోరుతున్నారు.
వారం రోజుల్లో 100 మందికి కుక్క కాట్లు
చికిత్స పొందుతూ ఓ యువతి కోమాలోకి


