
కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు
జమ్మికుంట: పట్టణంలోని ఆర్వోబీ కింద స్థలాల ఆక్రమణపై స్పెషల్ డ్రైవ్ రెండోరోజు కొనసాగింది. మున్సిపల్ కమిషనర్ ఎండీ.అయాజ్ ఆధ్వర్యంలో పలు దుకాణాలను, టేలాలను తొలగించారు. జమ్మికుంట పట్టణం వ్యాపారకేంద్రంగా కొనసాగుతోందని, చుట్టు పక్కల మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చిపోతుంటారని కమిషనర్ తెలిపారు. వారి వాహనాలను నిలిపేందుకు ఆర్‌వోబీ కింద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తామన్నారు. నిజమైన చిరువ్యాపారులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి, టీపీవో శ్రీధర్, టీపీటీవో దీపిక, శానిటరీ ఇన్స్‌స్పెక్టర్ మహేశ్, సదానందం, ఏఈ నరేశ్, ఆర్‌ఐ భాస్కర్, ఎన్వీరాల్‌మెంట్ ఇంజినీర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.