
రైల్వేగేజ్ రాడ్‌ను ఢీకొట్టిన లారీ
కరీంనగర్‌రూరల్: తీగలగుట్టపల్లి రైల్వేగేటు వద్ద భారీ వాహనాల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన గేజ్‌రాడ్‌ను మంగళవారం ఓ లారీ ఢీకొట్టడంతో విరిగిపోయింది. కరీంనగర్ నుంచి చొప్పదండి వైపు ప్రధానరోడ్డుపై ఉన్న రైల్వేగేటును ఆర్వోబీ నిర్మాణంలో భాగంగా దారి మళ్లించారు. భారీ వాహనాలు రాకుండా రైల్వేగేటుపై గేజ్‌రాడ్‌ను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం భారీ వాహనం రావడంతో గేజ్‌రాడ్ విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం మేర్పడింది. రైల్వేసిబ్బంది వచ్చి గేజ్‌రాడ్‌ను తొలగించగా పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.