
జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక
సిరిసిల్లటౌన్: ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ క్రీడాకారులు పతకాలు సాధించారు. మాస్టర్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 20 మంది క్రీడాకారులు పాల్గొని బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించి తమిళనాడులోని చైన్నెలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సీనియర్ క్రియేటివ్ ఫామ్ వెపన్ విభాగంలో ఎలగందుల శ్రీనివాస్ బంగారు, ఫైట్ జూనియర్ బాలికల విభాగంలో గంగనవేణి ప్రవళిక, అన్నాళదాస్ లక్ష్మీప్రసన్న, జూనియర్ బాలుర విభాగంలో చోడిబోయిన లోకేశ్, ఏర్నాల రాజశేఖర్, సబ్ జూనియర్ బాలికల విభాగంలో గజ్జెల శ్వేదిక, కర్నె యుతిక, బాలుర విభాగంలో గౌతమ్‌ఆనంద్, చోడిబోయిన శివష్, కొండ శ్రీరామ్, చిల్డ్రన్ కెడేట్ విభాగంలో గజ్జెల హిరణ్మయి, షేక్ ఆజహన్ రజత, కాంస్య తదితర పతకాలు సాధించారు. ఈసందర్భంగా క్రీడాకారులను తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, జనరల్ సెక్రటరీ మహిపాల్, కోశాధికారి పన్నీరు శ్రీనివాస్ అభినందించారు.