
తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించాలని..
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కు చెందిన స్రవంతి కరీంనగర్‌రూరల్ మండలం చెర్లభూత్కూర్‌లోని జెడ్పీ హైస్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వస్థలం పెద్దపల్లి జిల్లా ధూళికట్ట కాగా కరీంనగర్‌లో నివాసముంటున్నారు. భర్త శ్రీకాంత్ ల్యాబ్ టెక్నీషీయన్. కూతురు అమూల్య 6వ తరగతి, కుమారుడు సాయిమోక్షిత్ 4వ తరగతి చదువుతున్నారు. గతంలో వీరు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో చదువగా.. ప్రస్తుతం తల్లి వెంటే చెర్లభూత్కూర్ ప్రభుత్వ బడికి వెళ్తున్నారు. గ్రామంలోని తల్లిదండ్రులకు ప్రభుత్వ బడిపై నమ్మకం కల్పించేందుకు తన పిల్లలనూ అక్కడే చదివిపిస్తున్నట్లు టీచర్ స్రవంతి తెలిపారు.