
గురుకులం విద్యార్థులకు పురుగుల అన్నం
వెల్గటూర్: వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలోని బీసీ గురుకుల హాస్టల్ విద్యార్థులకు ఆదివారం పురుగులు పట్టిన భోజనం అందించడం కలకలం సృష్టించింది. పాఠశాలకు సందర్శనకు వెళ్లిన ఓ విద్యార్థి తండ్రి పురుగుల భోజనం చూడడంతో విషయం బయటకు తెలిసింది. గురుకులాల్లో తరచుగా నాసిరకం భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా.. ప్రతీరోజు బియ్యం శుభ్రం చేసిన తర్వాతే వండుతామని, ఆదివారం కావడంతో అధ్యాపకులు అందరూ సెలవులో ఉన్నారని, అందుకే పర్యవేక్షించలేదని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని తెలిపారు. నాసిరకం బియ్యం పాఠశాలలకు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.