
వన మహోత్సవానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: వనమహోత్సవ కార్యక్రమ విజయవంతానికి ప్రణాళికలు సిద్దం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శనివారం అధికారులతో రివ్యూ నిర్వహించారు. మొక్కలు నాటేందుకు టెండర్లు పూర్తి చేయాలన్నారు. ప్రజావాణి, పౌరసేవా కేంద్రాల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. సుందరీకణ పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ సువార్త, ఈఈ యాదగిరి, సంజీవ్, డీఈలు లచ్చిరెడ్డి, అయ్యూబ్ ఖాన్, వెంకటేశ్వర్లు, ఓంప్రకాశ్, శ్రీనివాస రావు, ఏఈలు సతీశ్, గట్టు స్వామి, గఫూర్ తదితరలు పాల్గొన్నారు.