
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం తాటిపల్లి శివారులో జగిత్యాల–నిజామాబాద్ ప్రధాన రహదారిపై గురువారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో జగిత్యాల ఉప్పరిపేటకు చెందిన కట్ట ఆదిత్యి (19) మృతి చెందగా, తాటిపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఉప్పరిపేటకు చెందిన ఆదిత్యి గురువారం పనినిమిత్తం ద్విచక్రవాహనంపై మేడిపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా తాటిపల్లి వద్ద మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, ఆదిత్యికు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదిత్యికు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీనివాస్‌కు కాలు విరగడంతో పాటు తలకు తీవ్రగాయాలయ్యాయి. మృతుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు.
బాలుడి అదృశ్యం
ఇబ్రహీంపట్నం: పాఠశాలకు వెళ్తున్న అని చెప్పి ఓ బాలు డు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం మూ లరాంపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి కందుకురి శ్రీధర్, వనితల కుమారుడు కందుకురి శ్రీకర్ (15) మండలంలోని వేములకుర్తిలో గల జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గురువా రం ఉదయం ఇంట్లో తల్లిదండ్రులకు పాఠశాలకు వెళ్తున్న అని చెప్పి బయలుదేరాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల బంధువులను, స్నేహితులను ఆరా తీయగా ఎక్కడ కనిపించలేదు. ఈవిషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ తెలిస్తే శ్రీకర్ తండ్రి సెల్ 9133241459, తల్లి వనిత 9701190360 లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఉరేసుకుని ఎస్సారెస్పీ ఉద్యోగి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని లింగంపేటలో తులసీనగర్‌కు చెందిన కండ్లపల్లి ధర్మయ్య (61) ఎస్సారెస్పీ లష్కర్ ఉద్యోగి శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధర్మయ్య కొన్ని రోజులుగా నరాల వ్యాధితో పాటు, ఇతర వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మనస్థాపానికి గురై శుక్రవారం ఉదయం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు రాసిన సూసైడ్ నోట్‌లో తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అనారోగ్య కారణాలతోనే తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుంటున్నానని, నన్ను క్షమించండి అంటూ లేఖ రాశాడు. దీంతో లేఖను చూసిన కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధించారు. కాగా, మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు.
మూడు రోజుల్లో ఉద్యోగ విరమణ
జగిత్యాల ఎస్సారెస్పీ కార్యాలయంలో లష్కర్‌గా పనిచేస్తున్న ధర్మయ్య ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే తీవ్ర అనారోగ్య బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఎస్సారెస్పీ ఉద్యోగులంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సీఐల బదిలీలు
కరీంనగర్‌క్రైం: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పలువురు సీఐలు బదిలీ అయ్యారు. జమ్మికుంట రూరల్ సీఐగా కె.లక్ష్మీనారాయణను నియమించారు. అక్కడ పనిచేసిన కె.కిషోర్‌ను ఐజీ కార్యాలయానికి బదిలీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న ఆర్.ప్రకాశ్‌గౌడ్‌ను కరీంనగర్ సీసీఎస్‌కు, పి.రాజేంద్రప్రాద్‌ను ఎస్‌బీ రామగుండంకు, వై.కృష్ణారెడ్డిని సీసీఎస్ రామగుండంకు బదిలీ చేశారు.

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి