
రాజన్నా... దీవించు
ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా మల్లన్న సన్నిధిలో పూజలు
ఓదెల(పెద్దపల్లి): ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా ఓదెల శ్రీమల్లికార్జునస్వామి సన్నిధిలో శుక్రవారం ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు. పాక్‌లోని ఉగ్రవాదులతో ధైర్యసాహసాలతో పోరాడుతున్న భారత త్రివిధ దళాలకు మద్దతుగా పూజలు చేశారు. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. మల్లికార్జునస్వామి, శ్రీసీతారామచంద్ర స్వామి, నందీశ్వరుల సన్నిధిలో పూజలు చేసి టెంకాయలను కొట్టారు. అనంతరం కశ్మీర్‌లో దుండగుల చేతిలో మృతి చెందిన పర్యాటకుల ఆత్మశాంతికి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఆలయ ఈవో సదయ్య, అర్చకులు పాల్గొన్నారు.
వేములవాడ: వేములవాడ రాజన్నను శుక్రవారం 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలసి రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. ఆపరేషన్ సిందూర్ దిగ్విజయం కావాలని, భారత త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలని రాజన్న ఆలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు స్వామివారి మహామంటపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సైన్యానికి దైవిక బలరక్షణ, స్వామి వారి ఆశీస్సులు ఉండాలని దేవాదాయ ధర్మాదాయశాఖ ఆదేశాలతో చండీ సహిత రుద్ర హోమం నిర్వహించారు.

రాజన్నా... దీవించు

రాజన్నా... దీవించు

రాజన్నా... దీవించు