
సిరిసిల్లలో ‘కాసం ఫ్యాషన్స్’ ప్రారంభం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో ‘కాసం ఫ్యాషన్స్’ షాపింగ్‌మాల్‌ను బుధవారం సినీనటి అనసూయ ప్రారంభించారు. పట్టుచీరలను అలంకరించుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. షాపింగ్‌మాల్ ముందున్న స్టేజీపైకి వచ్చి జనానికి అభివాదం తెలిపారు. సిరిసిల్లలో ‘కాసం ఫ్యాషన్స్’తో కొత్త కలెక్షన్స్ వచ్చాయని, అందరూ ఆదరించాలని కోరారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 17వ షాపింగ్‌మాల్‌ను సిరిసిల్లలో ప్రారంభించామని, మరో పది షాపింగ్ మాల్స్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ‘కాసం’ ఫ్యాషన్స్ డైరెక్టర్లు కాసం నమశివాయ, మల్లికార్జున్, కేధారినాథ్, శివప్రసాద్ ప్రకటించారు. నాణ్యమైన వస్త్రాలతో నమ్మకమైన వ్యాపారమే లక్ష్యమని వివరించారు. అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లో వస్త్రాలను అందిస్తామని, ఆధునాతన కలెక్షన్స్‌తో ముందుకు సాగుతామని కాసం ఫణీ, సాయికృష్ణ, యాంసాని ప్రవీణ్, పుల్లూరి అరుణ్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, మాజీ కౌన్సిలర్లు, టౌన్ సీఐ కృష్ణ, వస్త్ర వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో ‘కాసం ఫ్యాషన్స్’ ప్రారంభం